Chinnajeeyar Swamy : జ‌గ‌న్ అద్బుత‌మైన పాల‌కుడు

ప్ర‌శంసించిన చిన్న జీయ‌ర్ స్వామి

Chinnajeeyar Swamy : శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముచ్చింత‌ల్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి మ‌హోత్స‌వాల‌లో భాగంగా ఇవాళ ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా స్వామి వారు ఆశీస్సులు అంద‌జేశారు. సీఎంకు శాలువా, రామానుజుడి ప్ర‌తిమ‌ను బ‌హూక‌రించారు. అనంత‌రం జ‌గ‌న్ రెడ్డి పాల‌న అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

ఎంత ఎత్తుకు ఎదిగినా, సీఎం స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తి ఒక్క‌రు చెప్పిన దానిని వింటూ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బరుస్తున్నార‌ని చెప్పారు.

సీఎంకు వృత్తి ప‌ట్ల ఉన్న నిబ‌ద్ద‌త‌ను చూసి తాను ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాన‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన‌, నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా సీఎంను అభినందిస్తున్న‌ట్లు చెప్పారు చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

ప్ర‌తి పాల‌కుడికి ముందు చూపు, వ‌ర్త‌మానం, గ‌తం ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ఆ దిశ‌గా జ‌గ‌న్ అన్నింటిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌శంసించారు.

విద్య‌, వ‌య‌స్సు, ధ‌నం, అధికారం ఉన్న వారు ఇత‌రుల స‌ల‌హాలు తీసుకునేందుకు ఇష్ట ప‌డ‌ర‌న్నారు. కానీ ఇవ‌న్నీ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం ఎలాంటి గ‌ర్వం లేకుండా స్పందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి.

జ‌గ‌న్ రెడ్డి ఉన్న‌త స్థానాలు అధిరోహించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా సీఎంకు మంగ‌ళా శాస‌నాలు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : డేరా బాబాకు 21 రోజులు రిలీఫ్

Leave A Reply

Your Email Id will not be published!