Russian Space Chief : అంత‌రిక్ష కేంద్రం కూల్చేస్తాం

అమెరికాకు ర‌ష్యా స్ట్రాంగ్ వార్నింగ్

Russian Space Chief  : ఉక్రెయిన్ దాడుల నేప‌థ్యంలో అమెరికా, నాటో , ఇత‌ర దేశాలు త‌మ దేశంపై ఆంక్షలు విధించాల‌ని చూస్తే తాట తీస్తామ‌ని హెచ్చ‌రించింది ర‌ష్యా. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ స్పేస్ Russian Space Chief )ను కూల్చి వేస్తామంటూ ప్ర‌క‌టించింది.

బైడ‌న్ కు ఇది ఒక ర‌కంగా వార్నింగ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఉక్రెయిన్ ఇప్ప‌టికైనా త‌లొంచి, ఆర్మీ లొంగిపోతే చ‌ర్చ‌లకు సిద్దంగా ఉన్నామ‌ని లేక పోతే యుద్దం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

తాజాగా ర‌ష్యా అంత‌రించ చీఫ్ ఈ ర‌క‌మైన వార్నింగ్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపింది. యూఎస్ఏ, ఇండియా లేదా చైనా పై కూడా కూలి పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఉక్రెయిన్ విష‌యంలో ఎవ‌రు జోక్యం చేసుకున్నా ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు.

అమెరికా, ర‌ష్యా క‌లిసి అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ఈ త‌రుణంలో చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ర‌ష్యాపై అమెరికా ఆంక్ష‌లు ప్ర‌క‌టించిన ఒక రోజు త‌ర్వాత ఈ ప్ర‌క‌ట‌న రావడం ఆస‌క్తిక‌రంగా, చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

ర‌ష్యా అంత‌రిక్ష సంస్థ ప్ర‌స్తుత చీఫ్ డిమిత్రి రోగోజిన్ సీరియ‌స్ గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హంతో ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

అమెరికా తీసుకునే ఆంక్ష‌లు ర‌ష్యా సాంకేతిక పురోగ‌తిని ప్ర‌తికూలంగా ప్ర‌భావితం చేస్తాయ‌ని, వారి అంత‌రిక్ష కూడా ప్ర‌భావితం చేస్తాయ‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించాడు.

ప్ర‌పంచంలోని అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన రష్య‌న్ రాకెట్ల‌లో అన్ని దేశాలు త‌మ అంత‌రిక్ష నౌక‌ను ప్ర‌యోగించ‌కుండా నిషేధించాల‌ని అనుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు.

Also Read : న‌న్ను చంప‌డ‌మే ర‌ష్యా టార్గెట్

Leave A Reply

Your Email Id will not be published!