Perni Nani : ప్రతిదానిని రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు ఏపీ సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని(Perni Nani). తమ సహచర మంత్రిని కోల్పోయి తాము బాధ పడుతుంటే ఇంకో వైపు పవన్ సినిమాను తాము ఎందుకు తొక్కేస్తామని ప్రశ్నించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ బాబు కు ఏం పని లేదని ఎంత సేపు ఆరోపణలు చేయడం తప్ప అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ఈ తండ్రీకొడుకులకు ఏం పని అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.
ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతం రాజకీయంగా వారి లేమితనాన్ని సూచిస్తుందన్నారు. అదేమన్నా వస్తువా సినిమాను మేం తొక్కేయడం ఏంటి అంటూ నిలదీశారు.
దివంగత ఎన్టీఆర్, హరికృష్ణలను తొక్కిసిన చరిత్ర మీదన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ సినిమాను చూడమని ట్వీట్ చేయడం ఎంత వరకు న్యాయమని మండిపడ్డారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎందుకు అడగడం లేదంటూ పేర్కొన్నారు పేర్ని నాని.
కుప్పంలో వన్ సైడ్ లవ్ అంటూ ఉండదన్నావు. మరి ఇదేమి లవ్ చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు . పవన్ కళ్యాణ్ ను పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు.
రాజకీయంగా దిగజారిన మీకు ఎవరో ఒకరి సహాయం అవసరం కానీ ప్రజలు మాకు నువ్వు ఊహించని రీతిలో అద్భుతమైన మెజారిటీ ఇచ్చి కట్టబెట్టారంటూ చెప్పారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాకులో టికెట్లు అమ్ముతుంటే చూస్తూ ఊరు కోవాలా అని పేర్కొన్నారు.
Also Read : ఏపీ..తెలంగాణ కలవడం కష్టం