DJ Tillu Movie : డీజే టిల్లు క‌లెక్ష‌న్ల సునామీ

మూవీ భ‌ళా బాక్సులు గ‌ల‌గ‌ల

DJ Tillu Movie : వైజాగ్ కు చెందిన విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో హైద‌రాబాద్ కు చెందిన సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ , నేహా శెట్టి క‌లిసి న‌టించిన డీజే టిల్లు మూవీ(DJ Tillu Movie) క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలు లేకుండానే సినిమా స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ న‌ట‌న మూవీకి హైలెట్ గా నిలిచింది.

అంతే కాదు మూవీలో డైలాగులు పేలాయి. సిద్దూ ప‌లికిన తీరు మ‌రింత ఆక‌ట్టుకునేలా చేసింది. భారీ ఎత్తున ఈ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా పాట‌లు, ట్రైల‌ర్ ముఖ్యంగా యువ‌త‌ను ఆక‌ట్టుకున్నాయి.

విడుద‌లైన మూడు రోజుల‌కే సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. మార్కెట్ వ‌ర్గాల‌ను మెస్మైరైజ్ చేసింది.

విచిత్రం ఏమిటంటే మాస్ మ‌హ‌రాజా న‌టించిన ఖిలాడీ , ఎఫ్ఐఆర్ మూవీస్ విడుద‌లైన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌కే ఓటు వేశారు. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే రూ. 30 కోట్లు వ‌సూలు చేయ‌డం ఓ రికార్డు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

నైజాం ఏరియాలో రూ. 7.11 కోట్లు, సీడెడ్ లో రూ. 1.88 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో రూ. 1.39 కోట్లు, ఈస్ట్ , వెస్ట్ క‌లిపి రూ. 1.60 కోట్లు, నెల్లూరులో రూ. 0. 46 కోట్లు, కృష్ణలో రూ. 0. 66 కోట్లు, గుంటూరులో రూ. 0.77 కోట్లు వ‌సూళ్లు సాధించింది డీజే టిల్లు(DJ Tillu Movie).

ఇక తెలంగాణ‌, ఏపీ క‌లిపి రూ. 13.86 కోట్లు , ఓవ‌ర్సీస్ లో రూ. 2.05 కోట్లు, క‌ర్నాట‌క – ఇండియా రూ. 1.01 కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 16.92 కోట్లు వ‌సూలైంది. ప్ర‌స్తుతానికి సిద్దూ రూ. 30 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం విశేషం.

Also Read : మంచు ఫ్యామిలీపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!