Karanam Dharmasri : సభలో మరోసారి పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri ). విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1974లో అనేదెంపునంలో పుట్టారు.
ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎల్ చేశారు. అడ్వకేట్ గా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. యాక్టివ్ లీడర్ గా ఉన్నారు. 2004 నుంచి 2009 దాకా చోడవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా.
2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జగన్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
వైసీపీలో కరణం ధర్మశ్రీ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆయన శాసనసభలో అడుగు పెడితేనే సభ్యులంతా అలర్ట్ అవుతారు. అంతే కాదు హాయిగా నవ్వుకుంటారు.
ఏ అంశమైనా సరే కవితాత్మకంగా, వ్యంగ్యంగా, ఛలోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్బంగా మరోసారి తన వాక్ చాతుర్యానికి పదును పెట్టారు కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri ).
సంక్షేమం పేరుతో పథకాలు పెట్టి స్వాహా చేశాడంటూ కవితాత్మకంగా టీడీపీని, ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు.
ఎమ్మెల్యే పంచ్ లకు సభలోని సభ్యులంతా హర్షధ్వానాలతో సపోర్ట్ చేశారు. ఇదే సమయంలో స్పీకర్ గా ఉన్న సీతారం కొద్ది సేపు ఎంజాయ్ చేశారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించడమే కాదు వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయడంలోనూ ఆయన ముందుంటారు.
Also Read : ఆవిర్బావ సభలో పవన్ ఏం మాట్లాడబోతున్నారో?