Sarkaru Vaari Paata : 20న స‌ర్కారు వారి పాట సాంగ్

ఫ‌స్ట్ సాంగ్ కు భారీ రెస్పాన్స్

Sarkaru Vaari Paata : ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాటకు (Sarkaru Vaari Paata)సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గీత గోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ర్కారు వారి పాట‌కు సంబంధించి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సాంగ్ క‌ళావ‌తికి భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. విడుద‌లైన వెంట‌నే మిల‌య‌న్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ , జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్ , 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ ల‌పై నవీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ , రామ్ అచంట‌, గోపిచంద్ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది.

ఇక చిత్రానికి సంబంధించి మూవీ మేక‌ర్స్ ఈనెల 20న రెండో సాంగ్ ను విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దిగ్గ‌జ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్. ఎస్. థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా అనంత్ శ్రీ‌రామ్, త‌దిత‌రులు పాట‌లు రాశారు.

ఇక సినిమాను వ‌చ్చే మే 12న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఇప్ప‌టికే. ఇక చిత్రంలోని పెన్నీ అంటూ సాగే రెండో పాట‌ను ఈనెల 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్ .

చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఇక ఫ‌స్ట్ సాంగ్ క‌ళావ‌తికి ఇప్ప‌టి వ‌ర‌కు 90 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సాధించి దూసుకు పోతోంది. ఆర్ మ‌ధి కెమెరామెన్ గా ఉన్నారు.

తాజాగా విడుద‌ల‌య్యే రెండో సాంగ్ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఉంత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Also Read : మిస్ వ‌రల్డ్ మొద‌టి ర‌న్న‌రప్ గా శ్రీ షైనీ

Leave A Reply

Your Email Id will not be published!