Somu Veerraju : మోడీ చెప్పిన మాట‌కే దిక్కులేదు… ప్ర‌తినిధి చెపితే వింటారా?

Somu Veerraju : గ‌త ఎన్నిక‌ల‌లో నోటాతో పోటీ ప‌డ్డ బిజెపి తాజాగా ఏపిలో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌న్న తీరుగానే మాట్లాడుతొంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కోర్టుల‌లో రాష్ట్రానికి న‌చ్చిన‌ట్టు చేసుకోవ‌చ్చ‌ని అఫిడ‌విట్ ఇస్తే రాష్ట్ర బిజేపి నేత‌లు

Somu Veerraju : గ‌త ఎన్నిక‌ల‌లో నోటాతో పోటీ ప‌డ్డ బిజెపి తాజాగా ఏపిలో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌న్న తీరుగానే మాట్లాడుతొంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కోర్టుల‌లో రాష్ట్రానికి న‌చ్చిన‌ట్టు చేసుకోవ‌చ్చ‌ని అఫిడ‌విట్ ఇస్తే రాష్ట్ర బిజేపి నేత‌లు మాత్రం మాకు రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ స‌న్నాయి నొక్కులు చాలానే నొక్కారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగిందంటూ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్య‌ల‌ను కూడా వెన‌కేసుకుని మ‌రీ తెలుగుదేశం పార్టీని అప్ప‌టి ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టికీ తిట్టి పోస్తూ ఉండ‌టం స‌ర్వ సాధార‌ణ‌మై పోయింది ఆ పార్టీ నేత‌ల‌కు. జివిఎల్‌, విష్ణ‌వ‌ర్ధ‌న్‌, అస‌లు రాజ‌ధానికి మాకు ఏం సంబంధం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తే… బిజెపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మ‌రోమారు రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ జైకొట్టి మాట్లాడారు.

రాజ‌ధాని నిర్మాణంపై దృష్టి పెట్టాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌ల్సింది పోయి. రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇచ్చేయాలి, . 64వేల ప్లాట్ పోగా మిగిలిన భూమిని త‌దుప‌రి అభివృద్ధి చేయాలన్న‌ది ఆయ‌న ఈ రోజు తూళ్లూరులో జ‌రిగిన రైతు స‌ద‌స్సులో చెప్పిన మాట‌.

త‌మ‌కు అధికారం ఇస్తే అమరావతిని రూ. 5000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. రైతుల ప్లాట్‌లకు 2000 కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ హామీ ఇచ్చేయ‌ట‌మే కాదు. ఇది మోడీ ప్ర‌తినిధిగా చెపుతున్నా అంటూ కాస్త గ‌ట్టిగానే మాట్లాడారు. మ‌రి మోడీ గారే స్వ‌యంగా హోదా ఇస్తాన‌ని ఇచ్చిన హామీకే దిక్కులేదు క‌దా? అనంటే మాత్రం జ‌వాబివ్వ‌రు స‌రిక‌దాద‌ ర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌లు, ఎయిమ్స్ బీజేపీ వల్లే వచ్చాయి. అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు కట్టుబడి ఉన్నామంటూ చ‌ర్చ ప‌క్క‌కు నెట్ట‌డం విశేషం.
మ‌రి అమ‌రావ‌తి ఎక్స్ ప్రెస్ హైవే ఎందుకు కుదించారంటే దానికీ జ‌వాబులేదాయె.మా బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలోనే ఉంటుంది క‌నుక రాజ‌ధాని కూడా అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని వీర్రాజు వీరంగ‌మేసి మ‌రీ తేల్చి చెప్పారు.

అటు జ‌గ‌న్ ఇక్క‌డే ఇల్లు క‌ట్టుకున్నాడు… రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ తిప్పికొట్టాడు. తీరా అధికారంలోకి రాగానే మాట‌, చేత మారింద‌న్న విష‌యం గ‌మ‌నించాలంటే మాత్రం మాది రెండు నాల్క‌ల ధోర‌ని కానే కాదని చెపుతున్నాడు వీర్రాజు. మ‌రి వీర్రాజు మాట‌ల్ని జ‌నం న‌మ్ముతారా? 2023లో నోటాకు మించి ఓట్లేస్తారా? లేక ఏకంగా అధికార‌మే అప్ప‌గిస్తారా? చూడాలి మరి.

No comment allowed please