సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

2021 బిల్ల‌కు మ‌రిన్ని సవ‌ర‌ణలు చేసిన ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు కొర కొర‌రానిదిగా త‌యారైన సామాజిక మాధ్య‌మాల‌పై నియంత్రించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా గ‌తంలో తీసుకు వ‌చ్చిన నియంత్ర‌ణ బిల్లులో మ‌రిన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ప్ర‌తిపాదించారు ఇవాళ పార్ల‌మెంట్ సాక్షిగా.

ఈ మేర‌కు భారత ప్రభుత్వం ‘సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నియమాలు, 2021స బిల్లుకు మరిన్ని సవరణలను ప్రతిపాదించింది . డిజిటల్ రంగంలో నియంత్రణను పటిష్టం చేయడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం , తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడం లక్ష్యంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే చాలా మందిని జైలు పాలు చేసింది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ లేకుండా చేసేందుకే ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా దీనిని వ్య‌తిరేకిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికలపై వార్తా సంబంధిత కంటెంట్‌ను పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వ్యక్తిగత వినియోగదారులను కూడా ‘సమాచార సాంకేతికత నియమాలు, 2021’ పరిధిలోకి తీసుకు వచ్చేలా భారత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీంతో వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ అనేది ఉండ‌దు. దీని ద్వారా ఎవ‌రినైనా స‌రే ఏదో ఒక కారణంతో నేరుగా కేసులు న‌మోదు చేయ‌వ‌చ్చు. ఆపై అదుపులోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దీనిపై మేధావులు, బుద్ది జీవులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!