CM KCR PV : దేశాన్ని కాపాడిన తెలంగాణ బిడ్డ పీవీ

జ‌యంతి సంద‌ర్భంగా ప్రశంసించిన కేసీఆర్

CM KCR PV : మాజీ ప్ర‌ధాన మంత్రి, దివంగ‌త పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు (పీవీ) జ‌యంతి ఇవాళ‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. క్లిష్ట స‌మ‌యంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని కొనియాడారు. ఆనాడు పీఎంగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫ‌లాలే ఇవాళ దేశ ప్ర‌జ‌ల అనుభ‌వంలోకి వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.

జూన్ 28న 102వ జ‌యంతి పీవిది. సీఎం కేసీఆర్(CM KCR) సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. స్థిత ప్ర‌జ్ఞ‌త‌తో భార‌త దేశాన్ని ప్ర‌పంచ అగ్ర దేశాల స‌ర‌స‌న నిలిపేందుకు పునాది వేసిన దార్శ‌నికుడు పీవీ అని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్. త‌న‌దైన శైలిలో రాజ‌నీతిని, పాల‌నా ద‌క్ష‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ దేశానికి మౌనంగా మేలు చేసిన అరుదైన నాయ‌కుడు పీవీ అని పేర్కొన్నారు.

పలు సంస్క‌ర‌ణ‌ల‌తో భార‌త దేశ ఔన్న‌త్యాన్ని కాపాడిన ఘ‌న‌త తెలంగాణ బిడ్డ పీవీ న‌ర‌సింహారావుకే ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. వారి సేవ‌ల‌ను స‌మున్న‌తంగా గౌర‌వించుకునే బాధ్య‌త మ‌న మీద ఉంద‌న్నారు. వారి గొప్ప‌త‌నాన్ని గుర్తుంచుకునేందుకు పీవీ జయంతి ఉత్స‌వాల‌ను ప్ర‌భుత్వం అధికారికంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఠీవీ మ‌న పీవీ అని సీఎం పున‌రుద్ఘాటించారు. వారి స్పూర్తితో తాము ముందుకు సాగుతామ‌ని తెలిపారు.

Also Read : Pawan Kalyan : ప‌వ‌ర్ లోకి వ‌స్తే సింగిల్ విండో ప‌ద్ద‌తి

 

Leave A Reply

Your Email Id will not be published!