CM Revanth Reddy : మ‌హిళ‌ల‌కు రేవంత్ ఖుష్ క‌బ‌ర్

సోనియా పుట్టిన రోజు కానుక

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తాను చెప్పిన‌ట్టే సీఎం అయ్యాడు. స‌చివాల‌యంలో కొలువు తీరాడు. ఇచ్చిన హామీలను అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు నూత‌న ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డిచే బ‌స్సులలో క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

CM Revanth Reddy’s Good News

ఈ మేర‌కు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ తో . ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏఐసీసీ మాజీ చీఫ్‌, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబ‌ర్ 9 శ‌నివారం. దీంతో ఆమె పుట్టిన రోజు కానుక‌గా కొత్త ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు స‌జ్జ‌నార్. జీరో టికెట్ పేరుతో టికెట్ల‌ను ఇస్తామ‌ని తెలిపారు ఎండీ స‌జ్జ‌నార్. దీని వ‌ల్ల ఆర్టీసీకి అద‌న‌పు భారం ప‌డినా త‌మ ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. త‌ను ఇచ్చిన మాట ప్ర‌కారం అమ‌లు చేస్తున్నందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Sridhar Babu : ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత ప‌త్రం

Leave A Reply

Your Email Id will not be published!