అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం అన్నారు. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం అని తెలిపారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉందన్నారు. ఏపీలో నీటి నాణ్యత ను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించు కోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయన్నారు సీఎం. జేజెఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. సాగు కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారన్నారు. జేజేఎం 2.0 పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించు కుందాం అని తెలిపారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించు కోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని కోరారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్.
