ఆహ‌ర శుద్ది రంగంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులు

ఏపీ స‌ర్కార్ విత్త‌నం నుండి విస్త‌రి వ‌ర‌కు కార్య‌క్ర‌మం

అమ‌రావ‌తి : ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేలా చూస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విత్త‌నం నుండి విస్త‌రి వ‌ర‌కు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ విజన్‌ను రూపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతం ఇచ్చేలా ఈ నిర్ణ‌యం ఉంది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబ‌డులు రాష్ట్రానికి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్నారు సీఎం. ఇప్ప‌టికే 50 శాతం తీసుకొచ్చారు. ఈ విష‌యాన్ని స‌ర్కార్ వెల్ల‌డించింది అధికారికంగా. దానిని ధృవీక‌రించారు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టిజి భ‌ర‌త్. వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. భారతదేశం మొత్తం ఉత్పత్తి అయ్యే కోకో బీన్స్‌లో ఏకంగా 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.

కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో రైతులు టమాటోలను రోడ్డుపై పారబోసే పరిస్థితి లేకుండా కేంద్ర-రాష్ట్ర 50:50 భాగస్వామ్యంతో కూడిన ఆపరేషన్ గ్రీన్స్ కింద నిర్మిస్తున్న భారీ టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం సాధించ‌డం విశేషం. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఐఐటి తిరుపతి ఇన్క్యుబేషన్ సెంటర్ లో మ్యాంగో, టమాటో, సిట్రస్ ప్రాసెసింగ్ విజయవంతంగా నడుస్తోంది. వచ్చే నెల కల్లా పూర్తి కాబోయే అనకాపల్లి ప్లాంట్ లో జాక్ ఫ్రూట్ (పనస పండు), మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లను స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఫెసిలిటీస్‌తో అందుబాటులోకి తెస్తోంది స‌ర్కార్.

Leave A Reply

Your Email Id will not be published!