చెన్నై : తమిళనాడు రాష్ట్ర నూతన శాసన సభ సభాపతి (స్పీకర్ ) గా ఎన్నికయ్యారు టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్. ప్రభుత్వ ఏర్పాటు: తమిళనాడులో గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక రాజకీయాలను బద్దలు కొడుతూ, విజయ్ పార్టీకి అపూర్వమైన ప్రజా తీర్పు లభించిన నేపథ్యంలో… నాలుగు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ రాజకీయ సంప్రదింపుల అనంతరం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సమావేశమైనప్పుడు ప్రో-టెమ్ స్పీకర్ ఎంవీ కురుప్పయ్య మాట్లాడుతూ… ప్రభాకర్ నామినేషన్‌ను ముఖ్యమంత్రి C జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారని, స్పీకర్ పదవికి కేవలం ఆయన నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో, ఆయన ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికయ్యారని ప్రకటించారు.
ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో ప్రభాకర్ నిన్న ఈ పదవికి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.2026 అసెంబ్లీ ఎన్నికల్లో ‘థౌజండ్ లైట్స్’ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రభాకర్, ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి ఎజిలియన్ నాగనాథన్‌పై విజయం సాధించారు. ఇదిలా ఉండగా, తమిళనాడులోని అన్నా డీఎంకే కు చెందిన షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.
ఈ సందర్బంగా షణ్ముఖం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే డీఎంకేకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ. గత 53 ఏళ్ల నుంచి మా రాజకీయాలు కొనసాగుతూనే వచ్చాయని అన్నాడు. మా సభ్యులలో అత్యధికులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారని న్నారు. మరో వైపు 717 మద్యం దుకాణాలను మూసి వేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కమల్ హాసన్ మంగళవారం స్వాగతించారు.
