ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకోనుందని , ఆదిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగతోంది క్రికెట్ వర్గాలలో. ప్రధానంగా భారత జట్టును తన ఒంటి చేత్తో వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై వరుసగా అద్భుతమైన ఆట తీరుతో గెలిచేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కు కెప్టెన్సీ పదవి కట్టబెట్టాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ భావిస్తోంది. ఇప్పటికే టి20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో. కానీ తను గత కొంత కాలంగా పేలవమైన ఆట తీరుతో నిరాశ పరుస్తున్నాడు. కెప్టెన్సీ పరంగా ఓకే ఉన్నప్పటికీ ఆట పరంగా తను అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది. మరో వైపు శుభ్ మన్ గిల్ ను బీసీసీఐ పక్కకు తప్పించింది. తను టి20 ఫార్మాట్ కు పనికి రాడని పేర్కొంది.
తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ లో సూర్య కుమార్ యాదవ్ 10 మ్యాచ్‌లలో 19.52 సగటుతో, 150 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. పరిస్థితిని మరింత దిగజార్చేలా, అతని కెప్టెన్సీలో భారత్ టైటిల్ గెలుచుకున్న టీ20 ప్రపంచ కప్ 2026లో కూడా అతని ఫామ్ అంత గొప్పగా లేదు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే, సూర్యకుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు. ఈ పరుగుల కొరత ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని భారత టీ20 జట్టులో కెప్టెన్సీ మార్పును పరిశీలించేలా చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన సంజు సామ్సన్ భారతదేశ తదుపరి కెప్టెన్ అయ్యేందుకు ప్రధాన పోటీదారుగా ఉన్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే తదుపరి సిరీస్‌లో కెప్టెన్సీ మార్పు జరగవచ్చు. అయితే, ఈ రెండు సిరీస్‌లకు సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందని, కానీ అతని ఫామ్‌ను కమిటీ నిశితంగా పర్యవేక్షిస్తుందని కూడా ఆ నివేదిక పేర్కొంది.