రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. గుంటూరు లో గురువారం ఘనంగా జరిగిన ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, ఆయన 73వ జన్మదిన మహోత్సవ వేడుకలకు అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి గెలవడం కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఏకైక నేతగా ఘనత సాధించారని కితాబిచ్చారు.
క్రమశిక్షణ, పట్టుదల, పోరాట పటిమ కన్నా లక్ష్మీనారాయణ నైజమని , ఆయన నడిచిన బాట నుంచి నేటి తరం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్పీకర్. నాడు దివంగత ఎన్టీఆర్ తనకు టికెట్ ఇవ్వడం వల్లే నేడు ప్రజల ఎదుట ఇలా నిలబడే అవకాశం కలిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచు కోవాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నేటి యువత చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛమైన పాలన అందించాలని పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా కన్నా లక్ష్మీనారాయణ గొప్ప నటుడిగా, బాడీ బిల్డర్‌గా, ఎన్.సి.సి కేడెట్‌గా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారని ప్రశంసించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇలాంటి పెద్దాయన గురించి మాట్లాడే అవకాశం రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు.
Breaking
- దుమ్ము రేపుతున్న ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
- పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్
- సుప్రీం కోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి
- లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్
- ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై దాడులు దారుణం
- బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు
- 14న దుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
- సరస్ మేళా దేశానికి ఆదర్శంగా నిలవాలి : చంద్రబాబు నాయుడు
- ఆర్థిక నేరాలపై విచారణ వేగవంతం కావాలి : కొల్లు రవీంద్ర
- నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ