టెక్నాలజీని వినియోగించండి మానవ‌త‌తో వ్యవహరించండి

జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గ కూడదని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం అన్నారు. ఇ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు తెలిపారు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను అభినందిస్తున్నానని అన్నారు సీఎం. ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలన్నారు. గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గిందని చెప్పారు.

ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయని అన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశం. సీఎస్, సెక్రటరీలు, హెచ్వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు. మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతో పాటు… హ్యుమన్ టచ్ కూడా ముఖ్యం. మానవీయ కోణంలో ఆలోచించి పరిపాలన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పని తీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాం అన్నారు. జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాల‌న్నారు. జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు… మరింత మెరుగైన పాలనకూ కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు చంద్ర‌బాబు.

Leave A Reply

Your Email Id will not be published!