Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్
తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం - నైనార్ నాగేంద్రన్
Nainar Nagendran : టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం ఆయన ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని… అందువల్లే 41మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
Nainar Nagendran Shocking Comments
2026 ఏప్రిల్ 20 తర్వాత తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని… జనవరి 10 తర్వాత ఈ కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని నాగేంద్రన్ పేర్కొన్నారు. డీఎంకే (DMK) కూటమిలోని రెండు వర్గాలకు మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వాటితో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నారు. డీఎంకే అధికారం చేపట్టి నాలుగేళ్లైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేయని ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకును మాత్రం ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటికి ఆయన జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు.
కాగా కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు విజయ్‌తో కూటమి చర్చలకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు టీవీకేతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిసామి ఈనెల 6న విజయ్‌కు ఫోన్ చేసి… ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో కూటమి ఏర్పాటు చర్చలకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శత్రువైన డీఎంకేను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించడానికి ఒకే కూటమి గొడుగు కిందకు రావడం అవసరమని సూచించగా పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని విజయ్ సమాధానం ఇచ్చారని సమాచారం. మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
Also Read : Karur Stampede: సీబీఐ చేతికి కరూర్ తొక్కిసలాట కేసు
