హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన పిలుపు మేరకు పలు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్వచ్చంధంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో పేరు పొందిన ప్రముఖ సంస్థలు రహేష్ గ్రూప్ , రామ్ కీ ఫౌండేషన్ , యశోద ఫౌండేషన్ లు భారీ ఎత్తున నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కోసం సీఎస్ఆర్ కింద నిధులు ఇస్తామని ప్రకటించాయి. . సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ఒప్పందం చేసుకున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి కి ఒప్పంద పత్రాలను అందజేశారు రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి మొత్తం ఖర్చు లో 40% అంటే రూపాయలు 19.66 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది రాంకీ సంస్థ . రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణ లో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చు లో 40% అంటే రూపాయలు 10.4 కోట్లు భరించనున్నట్లు వెల్లడించింది రాంకీ సంస్థ. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కోసం అవసరమైన 50.50 కోట్ల లను భరించనుంది రహేజా గ్రూప్.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ MPPS లో ప్రీ ప్రైమరీ, 6వ, 7వ తరగతుల కోసం అవసరమైన 12.20 కోట్ల ను భరించనుంది యశోదా హాస్పిటల్స్ . ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి, తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) ఎండీ గణపతి రెడ్డి.