వివాదాస్పద సంభాషణలపై శ్రీకాంత్ ఓదెల కామెంట్స్
సుబ్బు పాత్రకు తల్లికి మధ్య వచ్చే సన్నివేశం పై స్పందన
హైదరాబాద్ : న్యాచురల్ స్టార్ నాని , కయాదు లోహర్, కీర్తి సురేష్ కీ రోల్ పోషించిన చిత్రం ది ప్యారడైజ్. తాజాగా విడుదలైన రోజు నుంచే మిశ్రమ స్పందన లభించింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకు పోతోంది ఈ మూవీ. ఇక ది ప్యారడైజ్ లో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మంగళవారం స్పందించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. . సుబ్బు , ఆమె ఒంటరి తల్లి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటారు.’ది ప్యారడైజ్’ చిత్రంలో కాయదు లోహర్ పోషించిన ‘సుబ్బు’ పాత్రకు, ఆమె తల్లికి మధ్య వచ్చే ఒక సన్నివేశం ప్రేక్షకులకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ కథనంలో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. సుబ్బు సినిమా నటి కావాలని కోరుకుంటుంది.. కానీ ఆమెకు ఆ ప్రతిభ ఉందని తల్లి నమ్మదు. ఒక అప్పు ఇచ్చిన వ్యక్తి తీవ్రంగా అవమానించినప్పుడు తనను, తన తల్లిని ఆ కష్టాల నుండి బయట పడేయాలనే ఆవేదనతో సుబ్బు ‘సాఫ్ట్-పోర్న్’ నటిగా మారాలని నిర్ణయించు కుంటుంది.
ఆ ‘బ్లూ ఫిల్మ్స్’ కోసం తల్లి కెమెరామెన్‌గా మారి సుబ్బుతో కలిసి ఇంట్లోనే సినిమాలు తీయడం ప్రారంభిస్తుంది. ఆమె మొదటి ‘బి-గ్రేడ్’ సినిమా విజయవంతమైన తర్వాత, తల్లి తన కూతురిని మెచ్చుకుంటూ ఇలా అంటుంది: “నువ్వు సింగిల్-టేక్ నటివి, బేటా (అమ్మా)”. ఈ మాట విన్నప్పుడు థియేటర్లో ప్రేక్షకులు వ్యంగ్యంగా నవ్వుతారు. ఏ తల్లి అయినా తన కూతురితో అలా అంటుందా? అని చాలామంది ప్రశ్నించారు. ‘నేచురల్ స్టార్’ నానితో జరిగిన సంభాషణలో శ్రీకాంత్ ఓదెల ఆ సంభాషణను సమర్థించుకున్నారు. ఆ తల్లికి తన కూతురి నటనపై ఎప్పుడూ నమ్మకం ఉండేది కాదు. అందుకే, ఆమె నటనను దగ్గరుండి చూసినప్పుడు, కూతురి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి, మెచ్చుకోలుతో ఆ మాటలు అంటుంది అని ఓదెల వివరించారు.
