త్వ‌ర‌లో భార‌త్ అమెరికా మ‌ధ్య వాణిజ్య ఒప్పందం

అగ్ర రాజ్య ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. డిసెంబర్‌లో G20 సదస్సు కోసం ప్రధాని మోదీ అమెరికా పర్య‌టిస్తారు. భారత్‌లో తన పర్యటన, రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అమెరికాను సందర్శించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపాదిత మధ్యంతర భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. IX USISPF లీడర్‌షిప్ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నారని గోర్ వెల్ల‌డించారు. ‘క్వాడ్’ (Quad) దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే మంత్రుల స్థాయి సమావేశాలను వ్యవస్థాగతం చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. సెక్రటరీ మార్కో రూబియో ఆయనను కలిసినప్పుడు ప్రధాని మోదీని ఆహ్వానించారని తెలిపారు. ఆయన మళ్లీ ఇక్కడికి రావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే, డిసెంబర్‌లో G20 సదస్సు కోసం ఆయన వస్తున్నారని నాకు తెలుసు అని గోర్ అన్నారు. భారత్‌లో తన పర్యటన గురించి వివ‌రించిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధానంగా రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి ప్ర‌స్తావించ‌డం జ‌రిగింద‌న్నారు.

అయితే ఈ ఒప్పందం వేలాది వస్తువులకు సంబంధించినది కావడంతో సమగ్ర న్యాయపరమైన సమీక్ష అవసరమని పేర్కొన్నారు .బంగ్లాదేశ్‌లో భారత రాయబారి బాధ్యతల స్వీకరణ, వీసా సేవలు పునరుద్ధరణ ప్రకటన. అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన అవకాశం గురించి అడిగినప్పుడు, అటువంటి పర్యటన వచ్చే ఏడాది ఉంటుందని గోర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!