విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. దళిత క్రిష్టియన్లకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత బాధాకరమని అన్నారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందన్నారు. ఇవాళ ప్రధాన వ్యవస్థలన్నీ మోదీ, అమిత్ షా చేతుల్లో ఉన్నాయని, చివరకు న్యాయవ్యవస్థను కూడా తమ కంట్రోల్ లోకి తీసుకున్నట్లు ఈ తీర్పు ద్వారా అనిపిస్తోందని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి తీర్పులు దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి తీర్పులు ప్రజల హక్కులను కాలరాస్తాయన్నారు. ఆర్టికల్ 14, 15, 25 ఇవేమీ పరిగణనలోకి సుప్రీం కోర్టు తీసుకోలేదని ఆరోపించారు . ఒకే రాజ్యాంగంలో ఉన్న వివిధ ఆర్టికల్స్ లో విభిన్న అంశాలు ఉన్నాయన్నారు. ఇలా ఉండకుండా ఒకే విధానాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కులం అనేది పుట్టుకతో వస్తుందని, అది సామాజిక వ్యాధిగా మారిందన్నారు.
కులం అనేది ఒక వివక్ష . సమాజంలో కుల వివక్ష ఇంకా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. దళితులు క్రిస్టియన్ గా మారితే వారి ఆర్ధిక స్థితి మారలేదన్నారు. తన సామాజిక స్థితి మారడం లేదన్నారు. అవమానాలు , దాడులు తగ్గడం లేదని వాపోయారు. దళితులను దళితులుగానే చూస్తున్నారని, దళితుల మీద దాడులు అరికట్టడానికే కొన్ని చట్టాలు ,ఎట్రాసిటీ యాక్ట్ లు ఉన్నాయన్నారు షర్మిలా రెడ్డి.
ST మతం మారితే ST గానే ఉన్నాడు .. BC మతం మారినా బీసీ గానే ఉన్నాడు .. OC మతం మారినా ఓసీ గానే ఉన్నాడన్నారు. ఒక్క SC లోనే మతం మారితే కులం ఎలా మారుతుంది ? ఇది చాలా దురదృష్టకరమన్నారు. కులం అనేది పుట్టుకతో వస్తుంది అని నిన్నటి తీర్పులో సుప్రీమ్ కోర్టు ఒప్పుకుందన్నారు. ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 లో హిందువులు, సిక్కులు, బుద్ధులు మాత్రమే ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
