PM Modi Advani : అద్వానీజీ అంతా కులాసాయేనా – మోదీ
95వ బర్త్ డే విషెష్ తెలిపిన ప్రధాని
PM Modi Advani : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) పుట్టిన రోజు ఇవాళ. నవంబర్ 8న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ కో ఫౌండర్ , మాజీ డిప్యూటీ పీఎంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ బర్త్ డే సందర్భంగా ఇద్దరూ ఎల్కే అద్వానీ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ప్రధాన మంత్రి పుష్ప గుచ్చం అద్వానీకి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
భారత దేశ పురోభివృద్దికి లాల్ కృష్ణ అద్వానీ అందించిన సహకారం విస్మరించ లేనిదని కొనియాడారు ప్రధాని(PM Modi Advani). అద్వానీ కూతురు ప్రతిభా అద్వానీతో కలిసి లాన్ లోకి వెళ్లారు. మోదీ, అద్వానీ చిరునవ్వులు చిందించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బీజేపీ అగ్ర నాయకుడు ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు పురస్కరించుకుని బీజేపీ , ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజ్ రంగ్ దళ్ కు చెందిన ప్రముఖులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, సంస్థకు అంకితమైన మీ జీవితం మాకు స్పూర్తిదాయకం అంటూ పేర్కొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
అద్వానీ తన అవిశ్రాంత ప్రయత్నాలతో దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా.
Also Read : లా కమిషన్ చైర్ పర్సన్ గా అవస్థి