Bandi Sanjay : బీఆర్ఎస్ వైరస్ బీజేపీ వ్యాక్సిన్ – బండి
తెలంగాణను ఏలనోడు ఏం చేస్తడు
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన అనంతరం బుధవారం దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
తెలంగాణలో ఏం ఒరగ బెట్టిండని బీఆర్ఎస్ గా మార్చిండని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ బండి సంజయ్(Bandi Sanjay) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని ఏకి పారేశారు. అంతే కాదు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అనేది కరోనా కంటే ప్రమాదమని అన్నారు. బీఆర్ఎస్ వైరస్ కు అసలైన మందు ఒక్కటే అది బీజేపీ వ్యాక్సినేనని స్పష్టం చేశారు బండి సంజయ్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇవాళ సీఎం కేసీఆర్ నిర్వాకం వల్ల, అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా అప్పులకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కేవలం ప్రగతి భవన్ కే పరిమితమై పోయిందన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వల్ల దేశానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. మోదీ సింహం లాంటోడని ఏ పార్టీకి చెందిన వారైనా తల వంచాల్సిందేనని అన్నారు బండి సంజయ్(Bandi Sanjay).
ఇకనైనా జనం మేల్కోవాలని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చాచరు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : భారత రాష్ట్ర సమితి ఆఫీసు ప్రారంభం
BRS is virus that kills !
BJP is Vaccine that protects !Now people will Decide what they want… pic.twitter.com/61cGv5U85j
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 14, 2022