Bandi Sanjay : కేసీఆర్ కు మొక్కిండు క్రీస్తు జపం చేస్తుండు
వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావుపై బండి
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులుగా ఉన్న శ్రీనివాస్ రావు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గారి నిర్వాకం దారుణంగా ఉందన్నారు. తన శాఖను చూసుకోవాల్సిన శ్రీనివాస్ రావు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నాడని, ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటికే జోకడం స్టార్ట్ చేశాడని మండిపడ్డారు. ఆపై అందరూ చూస్తు ఉండగానే సీఎం కేసీఆర్ కాళ్లు పదే పదే మొక్కి తెలంగాణ పరువు తీసిండని ఆవేదన చెందారు. తాజాగా క్రిస్టియన్ల వల్లనే అభివృద్ది జరిగిందని చెప్పడం సిగ్గు చేటు అని వెంటనే అతడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్(Bandi Sanjay).
క్రీస్తు ఎక్కడ ఉంటే ఆ దేశానికి పోవాలని సూచించారు. తెలంగాణలో నీ పని అయి పోయిందని, నీ వల్ల వైద్య ఆరోగ్య శాఖకు నష్టం తప్ప లాభం లేదన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిండు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మతానికి కొమ్ము కాస్తూ ప్రచారం చేస్తున్న..శ్రీనివాస్ రావు నీకు ఎందుకు డైరెక్టర్ పదవి అని నిలదీశారు.
ఏదో ఒక రోజు ప్రజలు వెంటపడి కొట్టే రోజు తప్పక వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం మనుషుల మధ్య మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారంటూ మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay). త్వరలోనే హెల్త్ డైరెక్టర్ నిర్వాకం, చేసిన అవినీతి గురించి ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : కాజీపేటకు రైల్వే కోచ్ మాటేంటి