H D Thammaiah Joins : బీజేపీకి షాక్ లింగాయ‌త్ లీడ‌ర్ జంప్

ఎన్నిక‌ల వేళ బీజేపీకి బిగ్ షాక్

H D Thammaiah Joins : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌ముఖ లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు హెచ్ డీ త‌మ్మ‌య్య‌. ఆయ‌న‌తో పాటు మ‌రో 500 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీకి బైబై చెప్పారు.

ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌య్య రాక‌తో మ‌రింత బ‌లం పెరిగింద‌ని అన్నారు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. రాష్ట్రంలో లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానిదే పై చేయిగా ఉంటూ వ‌స్తోంది. ఈ సామాజిక వ‌ర్గం ఎటు వైపు మొగ్గితే ఆ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంది. క‌నీసం 65 శాతానికి పైగా సీట్ల‌లో లింగాయ‌త్ లు ఎమ్మెల్యేల గెలుపుపై ప్ర‌భావితం చూప‌నున్నారు.

క‌ర్ణాట‌క‌లో బీజేపీ లింగాయ‌త్ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీటీ ర‌వికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందారు హెచ్ డి త‌మ్మ‌య్య‌. ఆయ‌న త‌న పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టంచారు. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ఎదురు చూస్తున్న నేత‌ల నుంచి అధికార బీజేపీ పార్టీ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. మ‌రో వైపు రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాలు మ‌రింత పెరిగాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే త‌మ్మ‌య్య(H D Thammaiah Joins) ఏ ప‌ద‌విని ఆశించి త‌మ పార్టీలోకి రావ‌డం లేద‌న్నారు డీకే శివ‌కుమార్. చాలా మంది కాషాయ పార్టీకి చెందిన నాయ‌కులు త‌మ పార్టీ వైపు చూస్తున్నార‌ని చెప్పారు. ఇది మార్పున‌కు సంకేత‌మ‌న్నారు డీకేఎస్. ఇదిలా ఉండ‌గా త‌మ్మ‌య్య 17 ఏళ్లుగా బీజేపీలో ప‌నిచేశారు.

Also Read : క‌ర్ణాట‌క‌లో జేపీ న‌డ్డా టూర్

Leave A Reply

Your Email Id will not be published!