Madhuri Jain Grover : ప‌న్ను చెల్లింపులో మాధురీ జైన్ టాప్

భార‌త్ పే మాజీ బాస్ అష్నీర్ గ్రోవ‌ర్ భార్య

Madhuri Jain Grover : భార‌త దేశంలో అత్య‌ధిక మ‌హిళా ప‌న్ను చెల్లింపుదారుల‌లో టాప్ లో నిలిచారు మాధురీ జైన్ గ్రోవ‌ర్(Madhuri Jain Grover). ఇదే విష‌యాన్ని భార‌త్ పే మాజీ బాస్ అష్నీర్ గ్రోవ‌ర్ వెల్ల‌డించారు. ఈమేర‌కు గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. త‌న భార్య పన్ను చెల్లింపుదారుల‌లో ఒక‌రిగా నిలిచి చ‌రిత్ర సృష్టించార‌ని , మిగ‌తా వారు కూడా ఆమెను అనుస‌రించి దేశానికి సంబంధించిన పన్నులు చెల్లించాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా భార‌త్ పే లో సీనియ‌ర్ ప‌ద‌విలో ఉన్న‌త త‌న భార్య రూ. 1.15 కోట్లు ముంద‌స్తుగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించింది. అష్నీర్ గ్రోవ‌ర్ త‌న భార్య దేశంలో అత్య‌ధిక మ‌హిళా ప‌న్ను చెల్లింపుదారుల్లో ఒక‌రుగా ఉండ‌డం త‌న‌కు సంతోషం క‌లిగిస్తోంద‌ని తెలిపారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం 2023-24కి గాను రూ. 2.84 కోట్ల ముంద‌స్తు పన్ను రూపేణా చెల్లించింద‌ని పేర్కొన్నారు అష్నీర్ గ్రోవ‌ర్.

త‌న భార్య స్టార్ట‌ప్ కంపెనీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం, విజ‌యాలు సాధించ‌డం వ‌ల్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని తెలిపారు భార‌త్ పే మాజీ బాస్. ఇదే సమ‌యంలో నిజాయితీగా ప‌న్ను చెల్లిస్తున్న వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు అష్నీర్ గ్రోవ‌ర్.

ఇదిలా ఉండ‌గా రియాలిటీషో షార్క్ ట్యాంక్ ఇండియా సీజ‌న్ 1లో న్యాయ నిర్ణేత‌గా ఉన్నారు భార‌త్ పే మాజీ చీఫ్ . అయితే గ్రోవ‌ర్, ఆయ‌న కుటుంబంపై రూ. 88.67 కోట్ల న‌ష్ట ప‌రిహారం కోరుతూ దావా వేసింది. న‌కిలీ బిల్లుల‌ను సృష్టించారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : ధ‌న్య రాజేంద్ర‌న్ కు పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!