KL Rahul : మానని గాయం రాహుల్ దూరం
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఛాన్స్ ఎవరికో
KL Rahul : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా తీవ్ర గాయం కావడంతో ఐపీఎల్ కు దూరమయ్యాడు. వైద్యుల సూచనల మేరకు కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు కేఎల్ రాహుల్(KL Rahul) .
దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఆడే భారత క్రికెట్ జట్టును ఇప్పటికే ప్రకటించింది. అందులో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో గాయం కారణంగా దూరం కావడంతో ఈ టెస్టు ఫైనల్ కు దూరం కానున్నాడు.
సోషల్ మీడియా వేదికగా తన ఇన్ స్టా గ్రామ్ లో తనంతకు తానుగా ఆడలేనంటూ పేర్కొన్నాడు. ఈ మేరకు పోస్ట్ ను షేర్ చేశాడు. లీగ్ లో భాగంగా మే1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డాడు ఫీల్డింగ్ లో కేఎల్ రాహుల్. తొడకు శస్త్ర చికిత్స చేయనున్నారు. పూర్తి కాలం విశ్రాంతి అవసరం.
దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో కృనాల్ పాండ్యాకు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. బీసీసీఐ రాహుల్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ లేదా సూర్య కుమార్ యాదవ్ లలో ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి.
Also Read : సమ ఉజ్జీల సమరానికి సై