Naga Chaitanya : స‌మంత అద్భుతం బాధాక‌రం

స‌మంత మంచి వ్య‌క్తి

Naga Chaitanya : తెలుగు సిని రంగానికి చెందిన అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత రూత్ ప్ర‌భు బంధం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ సుప‌రిచిత‌మే. ఈ ఇద్ద‌రు మొద‌ట ప్రేమించుకున్నారు . ఆ త‌ర్వాత నాగార్జున‌, అమ‌ల‌ను ఒప్పించారు. గ్రాండ్ గా పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత క‌లిసి ఉన్నారు. ఫోటోలు షేర్ చేశారు. మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి స‌మంత‌కు చైతన్య‌కు మ‌ధ్య బంధం బెడిసి కొట్టింది.

ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్ వేదిక‌గా తాము విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై సినీ లోకం విస్తు పోయింది. స‌మంత ప‌దే ప‌దే కామెంట్స్ చేయ‌డం, కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం, ఆపై వివాదాస్ప‌ద‌మైన ట్వీట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పెళ్లి చేసుకున్న స‌మ‌యంలోనే స‌మంత రుత్ ప్ర‌భు వెబ్ సీరీస్ లో న‌టించింది. అందులో బోల్డ్ గా న‌టించ‌డంతో ఒక్క‌సారిగా స‌మంత‌కు చెందిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఇలాంటి చెత్త సీన్ల‌లో ఎలా న‌టిస్తావంటూ నాగ చైతన్య ప్ర‌శ్నించ‌డం, నాగార్జున‌కు న‌చ్చ‌క పోవ‌డంతో స‌మంత‌పై ఒత్తిడి పెంచిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో త‌నంత‌కు తానుగా వెళ్లి పోతున్న‌ట్లు, విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండేళ్ల అనంత‌రం అక్కినేని నాగ చైత‌న్య స్పందించాడు. తామిద్ద‌రి మ‌ధ్య బంధం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నాడు.

Also Read : అతిలోక సుందరిలా అతిధి శంకర్ వయ్యారాలు విందు

Leave A Reply

Your Email Id will not be published!