Shubman Gill IPL : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ దంచి కొట్టింది.
గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubman Gill IPL) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైదానం అంతటా కళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఒకానొక దశలో పవర్ ప్లే పూర్తయ్యేసరికి గుజరాత్ టైటాన్స్ 80 రన్స్ కు చేరుకుందంటే ఎంత దూకుడుగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
శుభ్ మన్ గిల్ ఈ టోర్నీలో వరుసగా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. ఇక స్వంత గ్రౌండ్ లో షాకింగ్ షాట్స్ తో చుక్కలు చూపించాడు. 51 బంతులు ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్(Shubman Gill) 2 ఫోర్లు 7 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సాహాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 226 పరుగులతో భారీ స్కోర్ సాధించింది.
Also Read : వృద్ది మాన్ సాహా సాహోరే