Wriddhiman Saha : వృద్ది మాన్ సాహా సాహోరే
లక్నో బౌలర్లకు బిగ్ షాక్
Wriddhiman Saha : ఐపీఎల్ లీగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో పరుగుల వరద పారించింది హార్దిక్ పాండ్యా సేన. ఈ టోర్నీలో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ టైటాన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 226 రన్స్ చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ను 56 రన్స్ తో ఓడించింది. ఓపెనర్లుగా వచ్చిన గుజరాత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓ వైపు శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలిరేగితే ఇంకో వైపు వృద్ది మాన్ సాహా సెన్సేషన్ ఇన్నింగ్స్ తో బిగ్ షాక్ ఇచ్చాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు.
గిల్ 51 బాల్స్ ఎదుర్కొని 2 ఫోర్లు 7 సిక్సర్లు కొట్టాడు 94 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక వృద్ది మాన్ సాహా(Wriddhiman Saha) దంచి కొట్టాడు. కేవలం 43 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు కొట్టాడు. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో 81 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు.
అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో గుజరాత్ కు చుక్కలు చూపించింది. డికాక్ దంచి కొడితే , కైల్ మేయర్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ 70 రన్స్ కొడితే మేయర్స్ 48 చేశాడు.
Also Read : యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్