ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను టార్గెట్ చేశారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెర దించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని, మంత్రి మండలి అనుసరించి ఎల్జీ నడుచు కోవాల్సిందేనిని తీర్పు చెప్పింది.
అంతే కాదు శాంతి భద్రతలు, భూ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఎల్జీకి ప్రమేయం ఉంటుందని మిగతా వాటితో సంబంధం ఉండదని స్పష్టం చేసింది. దీనిపై ఎల్జీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ సంజయ్ సింగ్. ఆయనకు ప్రజా స్వామ్యం పట్ల నమ్మకం లేదన్నారు.
ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్జీకి ఎలాంటి పవర్స్ లేవని తెలిసినా మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను కూడా స్వీకరించేందుకు నిరాకరించారంటూ మండిపడ్డారు. ల్యాండ్ , లా అండ్ ఆర్డర్ , పోలీస్ , ఎల్జీ మినహా మిగిలిన అన్ని విషయాలపై ఢిల్లీ ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.
