రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృత్వంలోని బీజేపీ గెలవడం ఖాయమని తమను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదంటూ చేసిన ప్రకటన వర్కవుట్ కాలేదు. భారతీయ జనతా పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ గెలుపు వాకిట్లోకి తీసుకు వెళుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి ,ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ షాకు బిగ్ షాక్ తగిలింది.
తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఊహించని అపజయం ఎదురైంది. కాంగ్రెస్ కు అంత సీన్ లేదని, తమ గెలుపు పక్కా అని జోష్యం చెప్పారు అమిత్ షా. గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కన్నడనాట ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ఆరు నెలలకు ముందు కర్ణాటకపై ఫోకస్ పెట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. మోదీని ముందుంచారు.
ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ లేనంతగా నరేంద్ర మోదీ ప్రచారం చేపట్టారు. రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభలతో హోరెత్తించారు. ఆయనతో పాటు అమిత్ చంద్ర షా సైతం జల్లెడ పట్టారు. కర్ణాటకలో ఫుల్ ఫోకస్ పెట్టారు. కానీ తన పార్టీని పవర్ లోకి తీసుకు రాలేక పోయారు. ఈ ఫలితాలు ఒక రకంగా మోదీకి, అమిత్ షాకు , జేపీ నడ్డాకు చెంప పెట్టు అని చెప్పక తప్పదు.
40 శాతం కమీషన్ , అంతులేని అవినీతి, అక్రమాలు, కులం, మతం, విద్వేషం ఏదీ పని చేయలేదు. బజరంగ్ దళ్ నిషేధం పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని అనుకున్న ఆపార్టీని ప్రజలు తిరస్కరించారు.
