మాజీ సీఎం , బీజేపీ అగ్ర నేత జగదీష్ షెట్టర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను వంద శాతం గెలుస్తానని నమ్మకంతో ఉన్నానని కానీ బీజేపీ డబ్బులు పంపిణీ చేయడం వల్లనే ఓటమి పాలైనట్లు ఆరోపించారు. తన ప్రత్యర్థి ఓటర్లకు రూ. 500, రూ. 1,000 పంపిణీ చేశారని మండిపడ్డారు.
ఊహించని రీతిలో షెట్టర్ ఓడి పోయారు. కానీ బీజేపీ ఓడి పోగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 136 సీట్లు గెలుపొందింది. అధికారంలోకి రానుంది. ఆదివారం జగదీశ్ షెట్టర్ ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
భారతీయ జనతా పార్టీ తనను ఓడించాలని కంకణం కట్టుకుంది. ఎందుకంటే నేను ఆ పార్టీని టార్గెట్ చేశానని అన్నారు. కనీసం 20 సీట్లను తాను ప్రభావితం చేస్తానని ప్రకటించానని , అదే ఇవాళ జరిగిందన్నారు షెట్టర్. ఆయన హుబ్లీ – ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఆయన 34 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో కర్ణాటకకు సీఎంగా పని చేశారు.
తాను ఇప్పటికీ క్లీన్ ఇమేజ్ తో ఉన్నానని తనకు రాజకీయాలు చేయడం తెలియదని అన్నారు జగదీశ్ షెట్టర్. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప షెట్టర్ ను వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు.
