KC Venugopal : కేర‌ళ‌..తెలంగాణ‌లో పొత్తు ఉండ‌దు

కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్

పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్ . ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఏ పార్టీతోనూ త‌మ పార్టీ ప‌త్తు పెట్టుకునే ప్ర‌సక్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్ణాట‌క‌లో భారీ మెజారిటీ రావ‌డం త‌మ పార్టీ స‌త్తా ఏమిటో బ‌య‌ట ప‌డిందన్నారు. ఎవ‌రు సీఎం గా అవుతార‌నే దానిపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఎవ‌రైనా స‌రే పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటార‌ని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

అయితే కొన్ని రాష్ట్రాల్లో సైద్దాంతిక విభేదాలు ఉన్నా ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌ప్ప‌టికీ ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో ఎన్నిక‌ల అనంత‌రం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంద‌ని చెప్పారు కేసీ వేణుగోపాల్. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే క‌ర్ణాట‌క సీఎం కాలేర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాజ‌స్థాన్ లో చోటు చేసుకున్న విభేదాలు తొలిగి పోయేందుకు ఆస్కారం ఉంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు.

ఇది ప్ర‌తిప‌క్ష ఐక్య‌త‌కు సందేశం. జాతీయ స్థాయిలో క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేసీ వేణుగోపాల్. తాము కేర‌ళ‌లో సీపీఎంతో తెలంగాణ‌లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేమ‌న్నారు. ఖ‌ర్గే రేసులో లేర‌ని సిద్ద‌రామ‌య్య లేదా డీకే శివ‌కుమార్ ల‌లో ఎవ‌రో ఒక‌రు సీఎం అవుతార‌ని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!