DK Shiva Kumar : సిద్ద‌రామ‌య్య‌తో విభేదాలు అబ‌ద్దం

స్ప‌ష్టం చేసిన డీకే శివ‌కుమార్

క‌ర్ణాట‌క‌లో ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది. అధికారంలోకి వ‌చ్చేసింది. క‌న్న‌డ వాసులు స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ఆ పార్టీకి క‌ట్ట‌బెట్టారు. 224 సీట్ల‌కు గాను 136 సీట్ల‌తో విస్తు పోయేలా చేసింది. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ 65 సీట్ల‌కు ప‌రిమితం కాగా చ‌క్రం తిప్పుతాన‌ని భావించిన జేడీఎస్ బోర్లా ప‌డింది. ఆ పార్టీ 19 సీట్ల‌తోనే స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది.

మిగిలిన ఆ న‌లుగురు స్వ‌తంత్రులు కూడా హ‌స్తంతో దోస్తీ క‌ట్టేందుకు రెడీ అయ్యారు. ఒక‌వేళ వాళ్లు క‌లిస్తే సంఖ్య 140కి చేరుకుంటుంది. ఈ త‌రుణంలో తామిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్. త‌న‌కు సిద్ద‌రామ‌య్య‌కు మ‌ధ్య చ‌క్క‌డి అనుబంధం ఉంద‌న్నారు.

పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి సిద్ద‌రామ‌య్య‌కు అండ‌గా నిలిచాన‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశానికి ముందు ఇరువురు నేత‌ల మ‌ద్ద‌తుదారులు పోస్టర్ల వార్ కు దిగారు. సీఎల్పీ నేత ఎన్నిక‌ను ప‌ర్య‌వేక్షించేందుకు సుశీల్ కుమార్ ష‌ఙండే, జితేంద్ర సింగ్ , దీప‌క్ బ‌బారియాల‌ను కాంగ్రెస్ ప‌రిశీలకులుగా నియ‌మించింది.

Leave A Reply

Your Email Id will not be published!