శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక తెప్పోత్సవాలు మే 31 నుంచి వచ్చే నెల జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మ వారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఉత్సవాల్లో శ్రీ అలివేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుంటారు. అమ్మ వారి రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మ ఆరికి జ్యేష్ట శుద్ద ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. ఇందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది.
తెప్పోత్సవాలలో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలివేలు మంగ జీవ కోటికి మాతృమూర్తిగా మారి భవ జలధిలో మునిగి పోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. ఈ సందర్బంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
