మానవాళి శ్రేయస్సు కోసం సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం చేపట్టారు తిరుమలలో . ధర్మగిరి వేద పాఠశాలలో మంగళవారం పారాయణం ప్రారంభమైంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కేఎస్ఎస్ అవధాని మాట్లాడారు. సర్వ మానవాళి శ్రేయస్సును కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణాన్ని చేపట్టిందని తెలిపారు.
హనుమంతుడు సీతాదేవిని కలుసుకుని తిరిగి మహేంద్రగిరికి రావడానికి 16 గంటల సమయం పట్టందని చెప్పారు. సుందర కాండ లోని 2,872 శ్లోకాలను 16 గంటల్లో పఠించడం జరుగుతుందని దీని ద్వారా అన్ని సమస్యల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతామని చెప్పారు. రుత్వికులు పారాయణంతో పాటు ఏక కాలంలో యాగం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ అఖండ పారాయణ యజ్ఞం నిరాటంకంగా సాగనుంది. నాలుగు బృందాలుగా ఏర్పడి శ్లోకాలను పారాయణం చేస్తారు. మొదట సంక్షిప్త రామాయణం నుండి 100 శ్లోకాలు , సుందరకాండ లోని శ్లోకాలను పారాయణం చేయనున్నారు. ఒక వైపు శ్రీదేవి, భూదేమి సమేతంగా శ్రీవారు మరో వైపు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రాముడు , మరో వైపు రుక్మీణీ సమేత శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులు ఉండగా ధర్మగిరిలోని ప్రార్థనా మందిరాన్ని వివిధ దేవతా మూర్తులతో అలంకరించారు. ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
