తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని ప్రతిష్టాకంగా ఏర్పాటు చేసింది నీరా కేఫ్ . మంగళవారం అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ కేఫ్ ను సందర్శించారు.
ఆయనను సాదరంగా ఆహ్వానించారు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. ఆయనతో పాటు ప్రముఖ నటుడు సుమన్ కూడా నీరా కేఫ్ కు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు సుమన్ నీరాను రుచి చూశారు. సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల నీరా కేఫ్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , శ్రీనివాస్ యాదవ్ తాజాగా ప్రారంభించారు. రూ. 20 కోట్ల ఖర్చుతో రాష్ట్ర సర్కార్ నెక్లస్ రోడ్డులో ఏర్పాటు చేసింది. ఈ కేఫ్ లో 7 స్టాళ్లతో 500 మంది ఏకకాలంలో కూర్చునేలా ఏర్పాటు చేసింది సర్కార్. నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ప్రచారం చేశారని , కానీ ఇది ఆరోగ్య పరంగా ఎంతో విశిష్టమైన పానియం అని స్పష్టం చేశారు మంత్రి గౌడ్.
ఎలా తయారు చేస్తారు. సర్కార్ ఏ మేరకు ఖర్చు చేసిందనే, నీరా ఉత్పత్తి, యంత్రాల ఏర్పాటు, సర్కార్ పరంగా ఎలా సపోర్ట్ చేసిందనే దాని గురించి ఏపీ మంత్రి జోగి రమేష్ కు వివరించారు.
