PM Modi : క్రికెట్ వల్ల మన బంధం బలోపేతం – మోదీ
ఆస్ట్రేలియాలో ప్రధాన మంత్రి కామెంట్స్
PM Modi : ఆస్ట్రేలియా, భారత దేశాల మధ్య బంధం క్రికెట్ కంటే ఎక్కువ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా మంగళవరం సిడ్నీలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించారు. తాను తొలిసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించానని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాలను క్రికెట్ కలుపుతోందన్నారు. మరింత బలపడేలా చేస్తోందని చెప్పారు మోదీ.
భారత దేశం సాధించిన అనేక మైలురాళ్లను ప్రస్తావించారు. క్రికెట్ తో పాటు వంటకాలు కూడా ప్రాధాన్యత వహిస్తున్నాయని చెప్పారు. వీటితో పాటు యోగా, టెన్నిస్ , సినిమాలు, సాంస్కృతికంగా విభిన్నమైన భారతీయ సమాజాన్ని రెండు దేశాల మధ్య బలపరిచే బంధానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. 25 ఏళ్లలో భారత దేశం అభివృద్ది చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు.
క్రికెట్ అనేది మనల్ని యుగ యుగాలుగా కలుపుతూనే ఉందన్నారు. ఇప్పుడు టెన్నిస్ కూడా వంతెనలుగా ఏర్పడ్డాయని చెప్పారు మోదీ. ఒకప్పుడు కామన్వెల్త్ , క్రికెట్, కర్రీలను కలిపి మూడు సీలుగా పిలిచే వారన్నారు. అది త్రీడీలుగా మారి పోయిందన్నారు. ప్రజాస్వామ్యం, డయాస్పోరా , దోస్తీ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 3ఈలుగా మారాయన్నారు. ఇంధనం, ఆర్థికం, విద్యకు సంబంధించినదని చెప్పారు మోదీ. ఈ ఈవెంట్ లో ఆస్ట్రేలియా ప్రధాని మోదీని బాస్ అని పిలిచారు. స్మార్ట్ ఫోన్ డేటా వినియోగదారుల సంఖ్య, ఫిన్ టెక్ స్వీకరణ , పాల ఉత్పత్తిలో భారత దేశం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు .
Also Read : Arvind Kejriwal
