Modi Announce : త్వరలో బ్రిస్బేన్ లో భారత కాన్సులేట్
ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Modi Announce : ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) సంచలన ప్రకటన చేశారు. త్వరలో బ్రిస్బేన్ లో భారత కాన్సులేట్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సిడ్నీలోని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో కిక్కిరిసిన స్టేడియంలో ప్రసంగించారు. దీనికి ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ హాజరయ్యారు.
ప్రవాస భారతీయుల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను సాకారం చేసేందుకు బ్రిస్బేన్ లో కాన్సులేట్ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2016 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో 6,19,154 మంది ప్రజలు భారతీయ జాతికి చెందిన వారని ప్రకటించారు. ఇది ఆస్ట్రేలియన్ జనాభాలో 2.8 శాతం. వారిలో 5,92,000 మంది భారత్ లో జన్మించారు.
ది ఆస్ట్రేలియన్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఎం మోదీ ఆస్ట్రేలియాతో సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బహిరంగ, ఉచిత ఇండో పసిఫిక్ ను నిర్ధారించడంలో సహాయ పడటానికి సన్నిహిత రక్షణ, భద్రతా సంబంధాలతో సహా కీలకం కానున్నాయని చెప్పారు.
రెండు ప్రజాస్వామ్య దేశాలుగా భారత దేశం, ఆస్ట్రేలియాలు స్వేచ్ఛా, బహిరంగ , సమ్మిళిత ఇండో పసిఫిక్ లో ఆసక్తులను పంచుకున్నాయి. ఇదే సమయంలో ఇరు దేశాలు గత కొన్నేళ్లుగా అవినావ సంబంధాన్ని కలిగి ఉన్నాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరు కలలు కనాలని వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : PM Modi
