YS Sharmila : కాళేశ్వ‌రం ప్ర‌జ‌ల పాలిట శాపం – ష‌ర్మిల

సూటు బూటు వేసుకుంటే స‌రిపోతుందా

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. సూటు, బూటు వేసుకుంటే స‌రిపోతుందా అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేయ‌లేవంటూ పేర్కొన్నారు . దేశాలు దాటి ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పినా అవి నిజాలు ఎన్న‌టికీ కావ‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌. కాళేశ్వ‌రం ప్రాజెక్టు తెలంగాణ‌కు త‌ల‌మానికం కాద‌ని అది ప్ర‌జ‌ల పాలిట శాపం, గుదిబండ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జీవ‌ధార కాద‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి క‌మీష‌న్ల ధార అని ఎద్దేవా చేశారు ష‌ర్మిల‌(YS Sharmila). తెలంగాణ ఖాజ‌నాకు క‌న్నీటి ధార అంటూ మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం తండ్రీ కొడుకుల‌కు ఎప్పుడు క‌మీష‌న్లు కావాల‌నుకుంటే అప్పుడు వాడుకునే ఏటీఎం లాంటిద‌ని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు ఇంజ‌నీరింగ్ అద్భుత‌మ‌ని ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్న సీఎంకు సోయి అన్న‌ది ఉందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని చేప‌ట్టిన మెగా ప్రాజెక్టు పూర్తి వైఫ‌ల్య‌మ‌ని ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌.

ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసిన ఈ ప్రాజెక్టు వ‌ల్ల ఎంత సాగ‌వుతుందో చెప్ప‌లేని స్థితిలో స‌ర్కార్ ఉండ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. చిన్న దొర 90 ల‌క్షలు అంటే పెద్ద దొర 45 ల‌క్ష‌లు అని చెబుతాడ‌ని అల్లుడు హ‌రీశ్ ల‌క్ష ఎక‌రాల‌కు నీళ్లిచ్చామని గొప్పలు పోతున్నాడ‌ని ఎవ‌రి మాట న‌మ్మాల‌ని ఆమె ప్ర‌శ్నించారు.

Also Read : Modi Announce

 

Leave A Reply

Your Email Id will not be published!