Nara Lokesh : ఏపీలో రాచ‌రిక పాల‌న – లోకేష్

ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయం

Nara Lokesh : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ రాష్ట్ర పాల‌న‌పై విరుచుకు ప‌డ్డారు. సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వైసీపీ స‌ర్కార్ ఆశించిన మేర అంచ‌నాలు అందుకోలేక పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. యువ గ‌ళం పాద‌యాత్ర లో భాగంగా లోకేష్(Nara Lokesh) చేప‌ట్టిన పాద‌యాత్ర 113వ రోజుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం లోని స‌లివెందుల‌, దేవ‌గుడి క్రాస్ , ప్రొద్దుటూరు నియోజ‌వ‌ర్గం చౌడూరు, శంక‌రాపురం, పెద్ద‌శెట్టిప‌ల్లి, న‌ర‌సింహాపురం మీదుగా పాద‌యాత్ర కొన‌సాగింది. చౌడూరు ప్ర‌జ‌లు త‌న ప‌ట్ల చూపిన ఆద‌రాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు నారా లోకేష్(Nara Lokesh). ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన లోకేష్ జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు.

ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, పేద‌లు, సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా బ‌తికే ప‌రిస్థితులు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు లోకేష్. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని త‌మ ప్ర‌భుత్వం వ‌స్తేనే కానీ వారికి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని రాబోయే కాలం త‌మ‌దేన‌ని జోష్యం చెప్పారు నారా లోకేష్.

రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వ‌చ్చాయో చెప్పాల‌న్నారు. ఇంత కాలం మూడు రాజ‌ధానుల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడంటూ మండిప‌డ్డారు.

Also Read : Wrestlers Comment

Leave A Reply

Your Email Id will not be published!