Delhi Court Sisodia : పాలసీ మంచిదైతే ఉపసంహరణ దేనికి
మనీష్ సిసోడియాను ప్రశ్నించిన కోర్టు
Delhi Court Sisodia : ఢిల్లీ కోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. మద్యం పాలసీ మంచిదైతే ఉపసంహరణ దేనికి అని ప్రశ్నించింది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను. అంతా బాగుందని పదే పదే చెబుతున్నారు. అసలు మద్యం అమ్మడమే నేరం. కానీ ఆయా రాష్ట్రాలన్నీ మద్యం మీద వ్యాపారం చేస్తున్నాయి. మద్యం లేక పోతే ఖజానా నిండదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా(Sisodia) బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆరోపించిన కుంభకోణం నుండి ఉత్పన్నమయ్యే మనీ లాండరింగ్ కేసులో సహ నిందితుడు విజయ్ నాయర్ బెయిల్ దరఖాస్తును విచారిస్తున్న జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తన ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం పొందాలని ఆప్ నాయకుడి తరపు న్యాయవాదిని కోరారు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా తన మధ్యంతర విడుదల కోసం మరోసారి దరఖాస్తు చేసినట్లు సమాచారం. జడ్జి అడిగిన ప్రశ్నకు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోన్లలో మద్యం విక్రయాలను తెరిచేందుకు అనుమతించక పోవడంతో నష్టాలు వచ్చాయని తెలిపారు. దీంతో మద్యం పాలసీని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
సిసోడియా తరపు న్యాయవాది మాటలన్నీ అబద్దాలేనని సంచలన ఆరోపణలు చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. నిందితుల అక్రమాలు బహిర్గతం కావడం వల్లనే మద్యం పాలసీని ఉపసంహరించు కున్నారని ఆరోపించారు.
Also Read : Asmi Jain
