Bandi Sanjay Revanth : రేవంత్ పై భ‌గ్గుమ‌న్న బండి

ఆయ‌నలా పార్టీ మార‌డం చేత కాదు

Bandi Sanjay Revanth : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయ‌న లాగా త‌న‌కు పార్టీ మార‌డం చేత కాద‌న్నారు. శుక్ర‌వారం బండి సంజ‌య్(Bandi Sanjay) మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తాను ఇరుక్కోలేద‌న్నారు. అస‌లు ఆ పార్టీలో ఎవ‌రు చీఫ్ అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌డం లేద‌న్నారు. రేపు ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారంటూ ప్ర‌శ్నించారు.

తాను మొద‌టి నుంచి ఎవ‌రిని దేబరించ లేద‌న్నారు. స్వ‌త‌హాగా కింది స్థాయి నుంచి క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాన‌ని అన్నారు. పార్టీలో పైర‌వీలంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం పార్టీ ప‌ట్ల అంకిత భావం, నిబ‌ద్ద‌త‌నే ప్రాతిప‌దిక‌గా త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని దానిని తాము ఎంజాయ్ చేయ‌మ‌ని పేర్కొన్నారు. ఎవ‌రి చ‌రిత్ర ఏమిటో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప‌త‌నం ఖావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు బండి సంజ‌య్. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే మార్పు కోరుకుంటున్నార‌ని అది త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తేలుతుంద‌న్నారు. బీజేపీ బ‌లం గురించి మాట్లాడే ముందు త‌మ గురించి ఆలోచించు కోవాల‌న్నారు.

తాము బ‌రా బ‌ర్ బ‌రిలో నిలుస్తామ‌ని, అధికారంలోకి వ‌స్తామ‌ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Karnataka Formula Comment

Leave A Reply

Your Email Id will not be published!