Odisha Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్ర‌మాదం

237 మందికి పైగా మృతి

Odisha Train Accident : దేశ చ‌రిత్ర‌లో అత్యంత బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న‌. ఒడిశాలో ఘోర రైలు ప్ర‌మాదం(Odisha Train Accident) చోటు చేసుకుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 237 మంది ఈ దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంత మంది చ‌ని పోయార‌నే దానిపై వివ‌రాలు అందాల్సి ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతోంది. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. కుప్ప‌లుగా మృత దేహాలు ప‌డి ఉన్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్ర‌వారం సాయంత్రం కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ నాలుగు కోచ్ లు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో క‌నీసం 237 మంది మ‌ర‌ణించారు. 900 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. స్వాతంత్రం జ‌ర‌గిన త‌ర్వాత జ‌రిగిన ఘోర‌మైన ప్ర‌మాదాల్లో రైలు ప్ర‌మాదం ఒక‌టి.

కోల్ క‌తా నుంచి చెన్నైకి వెళుతున్న కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ బెంగ‌ళూరు నుంచి కోల్ క‌తా కు వెళుతున్న మ‌రో రైలు ప‌ట్టాలు త‌ప్పిన కోచ్ ల‌ను ఢీకొట్టింది. ఒకే ఒక్క బోగి లోని వ్య‌క్తుల‌ను ఇంకా ర‌క్షించాల్సి ఉంది. ఇది తీవ్రంగా చితికి పోయింది. రైల్వే ట్రాక్ లు అక్క‌డిక‌క్క‌డే ధ్వంస‌మయ్యాయి. కోచ్ లు పూర్తిగా ప‌డి ఉన్నాయి. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల , గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు ప్ర‌ధాన‌మంత్రి జాతీయ స‌హాయ నిధి నుండి అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు.

Also Read : Bandi Sanjay Revanth

Leave A Reply

Your Email Id will not be published!