Mumbai Trans Harbour Link : ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సిద్దం
ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభం
Mumbai Trans Harbour Link : నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబైకి తలమానికంగా నిలవబోతోంది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(Mumbai Trans Harbour Link). ముంబై – నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుండి 20 నిమిషాలకు తగ్గనుంది. ఇది గనుక ప్రారంభం అయితే భారీ ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు మెరగవుతాయి.
టెక్నాలజీలో ఇప్పటికే భారత దేశం టాప్ లో కొనసాగుతోంది. ప్రత్యేకించి డిజిటలైజేషన్ రంగంలో అగ్రభాగాన నిలిచింది. ఇక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దేశంలోనే అతి పెద్దది కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ముందు చూపునకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన భారత దేశాన్ని అన్ని రంగాలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఇప్పటి వరకు 93 శాతం పని పూర్తి కావచ్చింది. ఇక ఈ ఏడాది 2023 డిసెంబర్ లో దీనిని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటి వరకు ప్యాకేజీ -2 కోసం సెగ్మెంట్ పని పూర్తయింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ అభివృద్ది అథారిటీ (ఎంఎంఆర్డీఏ) కమిషనర్ ఎస్ . వి. ఆర్ శ్రీనివాస్. ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. ఇది అద్భుతమైన విజయంగా పేర్కొన్నారు.
Also Read : Buggana Rajendranath Reddy : కేంద్ర మంత్రితో బుగ్గన భేటీ