Karti P Chidambaram : డీకే శివకుమార్ తో కార్తీ భేటీ
కీలక అంశాలపై చర్చలు
Karti P Chidambaram : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తనయుడు ఎంపీ కార్తీ పి చిదంబరం(Karti P Chidambaram) బుధవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం సంతోషం వ్యక్తం చేశారు. తనకు సోదర సమానుడైన కార్తీ చిదంబరంతో సంభాషించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే దేశం పట్ల, ప్రత్యేకించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పట్ల ఎంతో అవగాహన ఎంపీ కార్తీ పి చిదంబరంకు ఉందని కొనియాడారు.
ఇదిలా ఉండగా కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేపీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ సాధించిందని కొనియాడారు. పార్టీ కలిసికట్టుగా జయభేరి మోగించడం బీజేపీకి ఝలక్ ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. అలుపెరుగని రీతిలో ఎంతో కష్టం చేసిన ఘనత డిప్యూటీ సీఎంకు దక్కుతుందని పేర్కొన్నారు కార్తీ పి చిదంబరం. తాము సమకాలీన రాజకీయాలు, ప్రాంతీయంగా చోటు చేసుకున్న సమస్యలు, ప్రాధాన్యతా అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చాయని స్పష్టం చేశారు ఎంపీ.
తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలి పోయింది. కేవలం 65 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది. ఈ మేరకు ఏకంగా 135 సీట్లు సాధించింది. 19 సీట్లతో సరి పెట్టుకుంది జేడీఎస్ . నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లు సైతం కాంగ్రెస్ కు జై కొట్టారు. దీంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 139కి చేరుకుంది.
Also Read : YS Sharmila : దొరలదే రాజ్యం తెలంగాణ నాశనం