Arvind Kejriwal : విద్య‌తోనే వికాసం విజ‌యం – కేజ్రీవాల్

చ‌దువుకుంటేనే భ‌విష్య‌త్తు

Arvind Kejriwal : ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్య తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, తద్వారా విజ‌యం ద‌క్కుతుంద‌ని అన్నారు. బుధ‌వారం న్యూ ఢిల్లీ లోని బ‌వానా , ధ‌ర్యాపూర్ క‌లాన్ లో ఏర్పాటు చేసిన‌ డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ స్కూల్ ఆఫ్ స్పెష‌లైజ్డ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు. చ‌దువుకుంటేనే భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్నారు. గ‌తంలో తాము చ‌దువుకునే స‌మ‌యంలో అవ‌కాశాలు, వ‌న‌రులు ఉండేవి కావ‌న్నారు సీఎం.

త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను ఈ సంద‌ర్భంగా నెమ‌రు వేసుకున్నారు. తాను ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో చ‌దువుకున్నాన‌ని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్. అప్పుడు నా ట్యూష‌న్ ఫీజు కేవలం రూ. 32 మాత్ర‌మేన‌ని అన్నారు. తాను ఇంజ‌నీరింగ్ చేసేందుకు ఈ దేశం త‌న కోసం ఖ‌ర్చు చేసింద‌న్నారు. తాను ఏనాడూ సీఎం అవుతాన‌ని అనుకోలేద‌న్నారు. నా ల‌క్ష్యం ఒక్క‌టే ఈ దేశానికి పాఠ‌శాల‌లు కావాలి. విద్య‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాలి. విద్య‌, వైద్యం, ఉపాధి ఉంటే దేశానికి ఢోకా అంటూ ఉండ‌ద‌న్నారు.

విద్యా రంగానికి త‌మ ప్ర‌భుత్వం ప్ర‌యారిటీ ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందు కోసం ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని చెప్పారు సీఎం. ధ‌న‌వంతుల పిల్ల‌లే కాదు పేద‌ల పిల్ల‌లు కూడా ఒకే త‌ర‌గ‌తి గ‌దిలో చ‌దువుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Karti P Chidambaram : డీకే శివ‌కుమార్ తో కార్తీ భేటీ

 

Leave A Reply

Your Email Id will not be published!