Revanth Reddy : అధికారంలోకి వస్తం జైలుకు పంపుతం
నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ , మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ప్రధానంగా సీఎం కేసీఆర్, కొడుకు కేటీఆర్ లను టార్గెట్ చేశారు. ధరణి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వేలాది భూములు అన్యాక్రాంతం అయ్యాయని దీనికి ప్రధాన కారకులు కేసీఆర్, మాజీ సీఎస్ ప్రస్తుత సలహాదారుడిగా ఉన్న సోమేశ్ కుమార్ కారణమన్నారు.
తాము అధికారంలోకి వస్తామని, వచ్చిన వెంటనే బరా బర్ ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇక అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్ లను విడిచి పెట్టమన్నారు. వారంతా చెర్లపల్లి జైలులో ఊచలు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రాజెక్టుల పేరుతో, భూముల అమ్మకం పేరుతో మోసానికి పాల్పడిన సీఎం కేసీఆర్ ,కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత, ఇంకోడు సంతోష్ రావులను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని, చెర్లపల్లి లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి అంత సీన్ లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేసీఆర్ కు పుట్ట గతులు ఉండవన్నారు. ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటారని , ఫామ్ హౌస్ లో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.
Also Read : Bhagavanth Kesari Teaser : బాలయ్య బర్త్ డే గిఫ్ట్
