RK Roja Admitted : రోజాకు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
వరుసగా రెండోసారి అనారోగ్యం
RK Roja Admitted : ఏపీ పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ నటి ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఆస్పత్రి వర్గాలు వివరాలు వెల్లడించ లేదు. గతంలో కూడా ఆర్కే రోజా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కోలుకున్న అనంతరం తిరిగి స్వస్థలానికి వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలులో, కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
సీఎం క్రీడోత్సవాలకు హాజరయ్యారు. తన నియోకవర్గంలో వాటిని సక్సెస్ చేశారు మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఇదిలా ఉండగా మంత్రి రోజా ఆస్పత్రిలో చేరారని సమాచారం తెలుసుకున్న వెంటనే ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వివరాలు తనకు ఎప్పటికప్పుడు తెలియ చేయాలని ఆదేశించారు.
మంత్రి ఆర్కే రోజా ఆరోగ్యం మెరుగు పడాలని కోరారు. ఇదిలా ఉండగా మంత్రి అనారోగ్యం గురించి తెలసుకున్న సహచర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అయితే ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నది సమాచారం. కాగా ఇప్పటి వరకు ఆర్కే రోజాకు ఏమైందనే విషయం తెలియ పర్చలేదు చెన్నై లోని అపోలో ఆస్పత్రి వర్గాలు.
Also Read : Amit Shah Tour : విశాఖలో అమిత్ షా సభ
